- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amitab Kant: భారతీయులు 80-90 గంటలు పనిచేయాల్సిందే: అమితాబ్ కాంత్
జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు హార్డ్‌వర్క్ ద్వారానే ఆర్థిక విజయాన్ని సాధించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: 2047 నాటికి భారత్ 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదిగేందుకు భారతీయులు మరింత కష్టపడి పనిచేయాలని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. గత కొన్ని వారాలుగా ఉద్యోగుల పని గంటలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమితాబ్ కాంత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు హార్డ్‌వర్క్ ద్వారానే ఆర్థిక విజయాన్ని సాధించాయి. ప్రపంచస్థాయిలో ఆర్థికవ్యవస్థను నిలబెట్టేందుకు భారత్ ఎక్కువ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కష్టపడే పనిని తాను నమ్ముతాను. భారతీయులు వారానికి 80-90 గంటలు కష్టపడి పనిచేయాలి. 4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 30 లక్షల కోట్ల డాలర్లకు చేరాలనే ఆశయం ఉన్నప్పుడు, వినోదం పొందితూ, కొంతమంది సినిమా స్టార్లను ఫాలో అయితేనో దాన్ని సాధించలేరని తెలిపారు. గత కొంతకాలంగా కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ సాధించలేమనే మాటలు ఫ్యాషన్‌గా మారాయని, కానీ భారత్ ప్రపంచస్థాయిలో ఉంచాలంటే, సమయం, ఎక్కువ ఖర్చు లేకుండా తొందరగా ప్రాజెక్టులను పూర్తిచేసే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కష్టపడకుండానే భారత్ గొప్ప దేశంగా అవతరిస్తుందని దేశంలోని యువ తరానికి తప్పుడు సందేశాలు పంపుతున్నాం. కష్టపడకుండా ఏ దేశం కూడా దీన్ని సాధించలేకపోయిందని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. కాగా, ఉద్యోగుల పని గంటలకు సంబంధించి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ, ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 70-90 గంటలు పనిచేయాలని చెప్పడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.






