- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Market: రికార్డు స్థాయికి చేరిన హౌసింగ్ మార్కెట్
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, గురుగ్రామ్ వంటి ప్రధాన మార్కెట్లలో పెద్ద అపార్ట్‌మెంట్లు, లగ్జరీ ఇళ్లు, అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ హౌసింగ్ మార్కెట్లో ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. ఇళ్ల అమ్మకాల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ, కొనుగోలుదారులు మరింత ఖరీదైన, ప్రీమియం గృహాలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ డేటా సంస్థ లియాసెస్ ఫోరాస్ నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 75 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 1 శాతం తగ్గి 7.1 లక్షల యూనిట్లకు చేరగా, మొత్తం విక్రయాల విలువ మాత్రం 16 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 9.33 లక్షల కోట్లకు చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, గురుగ్రామ్ వంటి ప్రధాన మార్కెట్లలో పెద్ద అపార్ట్‌మెంట్లు, లగ్జరీ ఇళ్లు, అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ దేశవ్యాప్తంగా మొత్తం గృహ విక్రయాల్లో దాదాపు 24 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, బెంగళూరు రెండో స్థానంలో కొనసాగింది. మరోవైపు, డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను వేగంగా అందుబాటులోకి తెస్తున్నారు. 2025-26లో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం పెరిగి 6.2 లక్షల యూనిట్లకు చేరగా, అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీలు 13 శాతం పెరిగి దాదాపు 12 లక్షల యూనిట్లకు చేరాయని నివేదిక పేర్కొంది.






