- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI: కంబోడియాలో ప్రారంభమైన యూపీఐ పేమెంట్స్
భారతీయ ప్రయాణికులు ఇప్పుడు ఆ దేశంలో 45 లక్షలకు పైగా మర్చంట్ ఔట్‌లెట్లలో యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ మరో కీలక అంతర్జాతీయ మైలురాయిని చేరుకుంది. భారత్-కంబోడియా మధ్య క్రాస్-బోర్డర్ క్యూఆర్ పేమెంట్స్ అనుసంధానం ప్రారంభం కావడంతో, కంబోడియాను సందర్శించే భారతీయ ప్రయాణికులు ఇప్పుడు ఆ దేశంలో 45 లక్షలకు పైగా మర్చంట్ ఔట్‌లెట్లలో యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), కంబోడియాలోని ఏసీఎల్ఈడీఏ బ్యాంక్‌తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భారతీయులు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా కంబోడియా జాతీయ క్యూఆర్ వ్యవస్థ కేహెచ్‌క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి రియల్‌టైమ్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఫలితంగా విదేశీ ప్రయాణాల్లో నగదు, కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లు సహా అనేక చోట్ల భారతీయులు సులభంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఇది కేవలం తొలి దశ మాత్రమే. రెండో దశలో కంబోడియా ప్రజలు కూడా తమ దేశీయ బ్యాంకింగ్ యాప్‌లతో భారత్‌లోని యూపీఐ మర్చంట్ ఔట్‌లెట్లలో చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది.






