Viral Video: UPI వద్దు.. క్యాష్ వద్దు.. నీ ఫేస్‌ చూస్తే డబ్బులు అవే స్కాన్ అయిపోతాయ్.. ఈ కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?

by Vennela |

Viral Video: భారతీయ పర్యాటకులకు దుబాయ్ పర్యటించడం..అక్కడ షాపింగ్ చేయడం చాలా సులభం అయింది.

Viral Video: UPI వద్దు.. క్యాష్ వద్దు.. నీ ఫేస్‌ చూస్తే డబ్బులు అవే స్కాన్ అయిపోతాయ్.. ఈ కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: భారతీయ పర్యాటకులకు దుబాయ్ పర్యటించడం..అక్కడ షాపింగ్ చేయడం చాలా సులభం అయింది. ఇక నుంచి దుబాయ్ మాల్‌లో క్యాష్ కార్డ్, యుపిఐ అవసరం లేదు. సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ ఫేస్ రికగ్నైజ్ ద్వారా మీ బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి.

చాలా మంది దుబాయ్ సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు కూడా దుబాయ్ వెళ్లే ప్లాన్ లో ఉన్నట్లయితే ఈ వార్త మీకోసమే. ముఖ్యంగా భారతీయ పర్యాటకులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ప్రస్తుతం చాలా మంది భారతీయ పర్యాటకులు UAE, ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. అంతేకాదు చాలా పర్యాటకులు సౌదీ అరేబియా వంటి దేశాలకు అక్కడి ప్రాంతాలను ఆస్వాదించేందుకు వెళ్తుంటారు. అయితే పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు యూపీఐ కానీ డబ్బులు కానీ అవసరం లేదు. కేవలం మీ ముఖాన్ని చూపిస్తే చాలు..ఆటోమేటిగ్గా మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి. అవును ఈ సరికొత్త టెక్నాలజీని దుబాయ్ మాల్లో ప్రవేశపెట్టారు.

ఈ ఫేస్ రికగ్నైజ్ పేమేంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడవచ్చు. ఇది దుబాయ్ మాల్లో తీసిన వీడియో. ఇక్కడ చెల్లింపు చేయడానికి నగదు, కార్డ్ లేదా UPI అవసరం లేదు. ఇక్కడ చెల్లింపు ముఖ గుర్తింపు ద్వారా మాత్రమే జరుగుతుంది. మీరు చెల్లింపు యంత్రం ముందు నిలబడండి, యంత్రం మీ ముఖాన్ని గుర్తిస్తుంది. మీరు ఏ చెల్లింపు చేసినా మీ బ్యాంకు అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి.


గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి)లో భారతీయ ప్రయాణికుల సంఖ్య 98 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ సంవత్సరం దాదాపు 54 లక్షల మంది భారతీయులు యుఎఇకి చేరుకుంటారని అంచనా. ప్రపంచ వేదికపై UPIని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NPCI ఇంటర్నేషనల్ కలిసి పనిచేస్తున్నాయి. దుబాయ్ మాల్స్‌లో చెల్లింపులు చేయడం ఇప్పుడు మరింత సులభతరం అయింది. ప్రస్తుతం ఫేస్ రిగ్నైజ్ తో ట్రాన్సాక్షన్స్ అనేది దుబాయ్ మాల్‌లో మాత్రమే వర్తిస్తుంది. భారతదేశం వెలుపల, నేపాల్, శ్రీలంక, మారిషస్, UAE, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్‌లలో UPI (QR కోడ్) ద్వారా మాత్రమే చెల్లింపులు జరుగుతున్నాయి.

Next Story