- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: చారిత్రాత్మక నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు
అమ్మకాలు కొనసాగడంతో మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు వరుసగా తొమ్మిదవ రోజు బలహీనపడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రికార్డు నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగడంతో మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు వరుసగా తొమ్మిదవ రోజు బలహీనపడ్డాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విధంగా చైనాతో పాటు కెనడా, మెక్సికోలపై టారిఫ్‌ను అమలు చేయడంతో గ్లోబల్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇదే సమయంలో చైనా సైతం అమెరికా ఉత్పత్తులపైన ప్రతీకార పన్నులను విధించడంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. దీంతో పాటు మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణను కొనసాగించడం, కీలక ఐటీ రంగం, రిలయన్స్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లలో అమ్మకాలు నష్టాలకు కారణమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లడంతో మన స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక నష్టాల్లోకి జారాయి. ఫలితంగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఏకంగా తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన గరిష్టాల నుంచి 16 శాతం క్షీణించిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, స్టాక్స్ అధిక వాల్యూయేషన్‌లపై ఆందోళనల కారణంగా గ్లోబల్ ఫండ్లు ఈ ఏడాది దాదాపు రూ. 1.22 లక్షల కోట్లకు పైగా వెనక్కి తీసుకెళ్లాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 96.01 పాయింట్లు క్షీణించి 72,989 వద్ద, నిఫ్టీ 36.65 పాయింట్లు నష్టపోయి 22,082 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.16 వద్ద ఉంది.






