- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Restaurant Industry: ఇరాన్ యుద్ధంతో రెస్టారెంట్లకు రూ. 79,000 కోట్ల నష్టం
రోజువారీ కార్యకలాపాలకు ఎల్‌పీజీపై అధికంగా ఆధారపడే ఈ రంగానికి ఇది పెద్ద దెబ్బ.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనివల్ల దేశంలోని రెస్టారెంట్ రంగం తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) తాజా నివేదిక ప్రకారం, గ్యాస్ కొరత కారణంగా దేశంలోని రెస్టారెంట్ పరిశ్రమ నెలకు సుమారు రూ. 79,000 కోట్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రోజువారీ కార్యకలాపాలకు ఎల్‌పీజీపై అధికంగా ఆధారపడే ఈ రంగానికి ఇది పెద్ద దెబ్బ. పరిశ్రమ అంచనాల ప్రకారం, మనదేశంలో ఆహార సేవల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. 2024లో ఈ రంగం విలువ రూ. 5.69 లక్షల కోట్లుగా ఉండగా, 2028 నాటికి రూ. 7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2026 నాటికి ఇది సుమారు రూ. 6.46 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. దీని ప్రకారం, ఈ రంగం రోజుకు సుమారు రూ. 17,700 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
ప్రస్తుత ఇంధన సమస్య కారణంగా రెస్టారెంట్ పరిశ్రమ 15-20 శాతం క్షీణించిందని నివేదిక చెబుతోంది. దీంతో రోజుకు రూ. 2,650 కోట్లకు పైగా నష్టపోతోంది. అంటే నెలకు రూ. 79 వేల కోట్లకు పైనే. ఇప్పటికే ఈ సంక్షోభ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత రెస్టారెంట్ అసోసియేషన్ ప్రకారం, దాదాపు 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. మరో 60–70 శాతం సంస్థలు పరిమిత సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయి. అనేక రెస్టారెంట్లు ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్, ప్రత్యామ్నాయ ఇంధనం, తగ్గించిన మెనూ, తక్కువ పని గంటలతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సాగర్ దర్యాణి పేర్కొన్నారు.






