IOB: తగ్గనున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రుణ రేట్లు

by S Gopi |

సవరించిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

IOB: తగ్గనున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రుణ రేట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) రిటైల్‌ రుణాలపై మార్జినల్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని కాలపరిమితులపై సగటున 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంకు బుధవారం ప్రకటన జారీ చేసింది. సవరించిన రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 14న జరిగిన బ్యాంకు అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఎంసీఎల్ఆర్‌ను సమీక్షించి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపింది. దీంతో బ్యాంకు ఖాతాదారులు రిటైల్ విభాగంలో తీసుకున్న వాహన, వ్యక్తిగత, గృహ రుణాలు మరింత చౌకగా మారతాయి. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం రేట్లు సవరించిన తర్వాత.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది. నెల రోజులకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ 8.50 శాతం నుంచి 8.40 శాతం, మూడు, ఆరు నెలల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌లు 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. ముఖ్యంగా రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ కూడా 9.10 శాతం నుంచి 9 శాతానికి దిగొచ్చింది.

Next Story