FLASH : భారీగా పెరిగిన డీజిల్ ధర.. ఏకంగా రూ.22 పెంపు

by Naga Rani Yarlagadda |

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైంది. లీటర్ డీజిల్ పై IOCL ఏకంగా రూ.22 పెంచింది.

FLASH : భారీగా పెరిగిన డీజిల్ ధర.. ఏకంగా రూ.22 పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ఇప్పటికే HPCL పవర్ పెట్రోల్ పై రూ.2.30 పెరిగి లీటరు పవర్ పెట్రోల్ రేటు రూ.115కు చేరినట్లు వార్తలొచ్చాయి. BPCL స్పీడ్ పెట్రోల్, IOCL XP95 పెట్రోల్ ధరలు లీటరుపై రూ.2.09- రూ.2.35 పెరిగినట్లు ANI నివేదించింది. కొద్దిసేపటికే డీజిల్ ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుపై ఏకంగా రూ.22 పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఇండస్ట్రియల్ డీజిల్ ధరను భారీగా పెంచినట్లు జాతీయ మీడియా పేర్కొంది. నిన్నటి వరకూ రూ.87.57గా ఉన్న లీటరు ఇండస్ట్రియల్ డీజిల్ ధర తాజాగా పెంచిన ధరతో రూ.109.59కి చేరింది. కాగా.. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులేదు. కానీ.. అటు పవర్ పెట్రోల్, ఇటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో.. రెగ్యులర్ ఫ్యూయల్ రేట్లు కూడా త్వరలోనే పెరుగుతాయన్న ఆందోళన మొదలైంది. దీంతో కొందరు వాహనదారులు ముందుగానే బాటిళ్లతో పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు.

Next Story