Chinese Smartphones: వన్‌ప్లస్, ఐకూ, పోకో ఫోన్‌లను బ్యాన్ చేయాలని రిటైలర్ల డిమాండ్

by S Gopi |
Chinese Smartphones: వన్‌ప్లస్, ఐకూ, పోకో ఫోన్‌లను బ్యాన్ చేయాలని రిటైలర్ల డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై దేశీయ రిటైలర్లు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నారు. ముఖ్యంగా స్థానిక వ్యాపారాన్ని ఆయా కంపెనీలు దెబ్బతీస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఐక్యూ, వన్‌ప్లస్, పోకోలను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్(ఏఐఎంఆర్ఏ) పిలుపునిచ్చింది. స్థానిక వ్యాపారాలు, దేశ ఆర్థికవ్యవస్థకు హానీ కలిగించే వ్యతిరేక పద్దతులను ఆరోపిస్తూ ఆయా కంపెనీల లైసెన్సులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. సీసీఐ సూచిస్తున్నప్పటికీ, ఈ కంపెనీలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో ప్రత్యేక ఒప్పందాలను కొనసాగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయాలకు ఆ కంపెనీలు నిరాకరిస్తున్నాయని అసోసియేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కైలాష్ లఖ్యాని చెప్పారు. అంతేకాకుండా నిధుల విషయంలో అంతరాయం కలిగించడం, వాణిజ్య పద్దతులను బలహీనపరచడం వటి అంశాలపై ఆందోళనలను అసోసియేషన్ లేవనెత్తింది.

Advertisement

Next Story