- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SEBI: పశ్చిమాసియా సంక్షోభంతో భారత స్టాక్ మార్కెట్లకు ఢోకా లేదు
ప్రపంచ మార్కెట్లు పరస్పరం అనుసంధానమై ఉన్నందున ఒక ప్రాంతంలో తలెత్తే సంక్షోభం మిగతా దేశాలపై కూడా ప్రభావం చూపడం సహజమని చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈ ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. సోమవారం దేశీయ పెట్టుబడిదారుల అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రపంచ మార్కెట్లు పరస్పరం అనుసంధానమై ఉన్నందున ఒక ప్రాంతంలో తలెత్తే సంక్షోభం మిగతా దేశాలపై కూడా ప్రభావం చూపడం సహజమని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా చమురు సరఫరా దెబ్బతినడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపైనా పడుతోంది, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా దిగుమతులపై ఆధారపడే దేశాలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ టెన్షన్స్ మధ్య తాత్కాలికంగా హెచ్చుతగ్గులు వచ్చినా, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మార్కెట్లు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పెరుగుతున్న దేశీయ పెట్టుబడులు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతు, నియంత్రణ వ్యవస్థల సామర్థ్యం వల్ల భారత మార్కెట్ గ్లోబల్ షాక్స్‌ను ఎదుర్కొనే స్థాయికి చేరుకుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.






