- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashwini Vaishnaw: సాఫ్ట్‌వేర్ నుంచి ఏఐ సొల్యూషన్ల వైపు మారుతున్న భారతీయ ఐటీ పరిశ్రమ
దశాబ్దాలుగా మన ఐటీ పరిశ్రమకు ఉన్న బలాన్ని, పాత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మోడల్‌కు బదులుగా, ఏఐ సొల్యూషన్స్ అందించేలా ఉపయోగిస్తున్నామని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ రంగం సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నుంచి వేగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సొల్యూషన్ల వైపు పయనిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దశాబ్దాలుగా మన ఐటీ పరిశ్రమకు ఉన్న బలాన్ని, పాత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి మోడల్‌కు బదులుగా, ఏఐ సొల్యూషన్స్ అందించేలా ఉపయోగిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్ ఇప్పటికే ఏఐ సంబంధిత రంగంలో 70 బిలియన్ డాలర్ల(రూ. 6.44 లక్షల కోట్ల) పెట్టుబడులను సాధించింది. వచ్చే నెలలో జరిగే ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఇది రెట్టింపు కావొచ్చని వెల్లడించారు.
ఈ సమ్మిట్ ప్రపంచంలోనే నాల్గవ, అతిపెద్ద ఏఐ సదస్సు. భారత్ తన ఏఐ ఎకోసిస్టమ్‌ను సరైన క్రమంలో అభివృద్ధి చేసిందని, దీని ద్వారా ప్రపంచ ఏఐ అభివృద్ధిలో దేశాన్ని కీలకంగా మార్చిందని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులకు కొత్త స్కిల్స్ కోసం శిక్షణ ఇస్తున్నాయని, క్లయింట్లతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయని, కొత్త మార్కెట్ అవకాశాలను అన్వేషిస్తున్నాయని మంత్రి అన్నారు. ఇప్పటికే 5,00,000 మందికి పైగా విద్యార్థులు ఏఐ స్కిల్స్‌ను అందిపుచ్చుకున్నారు. త్వరలో 500 విశ్వవిద్యాలయాలలో ఏఐ మౌలిక సదుపాయాలు, కోర్సు పాఠ్యాంశాలను అందిస్తామని, తద్వారా విద్యార్థులు ఏఐ అవకాశాలపై మెరుగైన శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.






