- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Investors: 4 రెట్లు పెరిగిన భారతీయుల గ్లోబల్ పెట్టుబడులు
ప్రధానంగా సింగిల్-స్టాక్ పెట్టుబడులకు మించి యూఎస్ ఈక్విటీలు, ఇండెక్స్ సహా గ్లోబల్ ఫండ్‌లలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ పెట్టుబడిదారులు ప్రపంచ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కంటే వేగవంతంగా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడుతున్నారని ఓ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో మనవాళ్ల విదేశీ పెట్టుబడులు నాలుగు రెట్లు పెరిగి 1.6 బిలియన్ డాలర్ల(రూ. 14.54 వేల కోట్ల)కు చేరుకున్నాయని వెస్టెడ్ ఫైనాన్స్ హౌ ఇండియా ఇన్వెస్ట్స్ గ్లోబల్లీ-2025 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా సింగిల్-స్టాక్ పెట్టుబడులకు మించి యూఎస్ ఈక్విటీలు, ఇండెక్స్, థీమాటిక్ ఈటీఎఫ్‌లు, ప్రైవేట్ మార్కెట్, గిఫ్ట్ సిటీ-డొమిసిల్డ్ ఫండ్‌లతో సహా గ్లోబల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడి వైవిధ్యం, అధిక రాబడి, దీర్ఘకాలిక మూలధన పెరుగుదల సాధించడానికి ఎక్కువమంది భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్న వారిలో దాదాపు సగం మంది 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు వారు కావడం గమనార్హం. అలాగే, పెట్టుబడి పెట్టేవారిలో ఎక్కువగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు టెస్లా, ఎన్విడియా వంటి వాటిలోనే ఎక్కువ నిధులు పెడుతున్నారు. ఇవి కాకుండా యాపిల్, మెటా ప్లాట్‌ఫామ్స్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రధాన గ్లోబల్ కంపెనీల్లోనూ మనవాళ్లు మదుపు చేస్తున్నారు.






