- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: రికార్డు స్థాయికి బంగారం పెట్టుబడులు
తక్కువ పెట్టుబడి పెట్టాలని భావించే వారిలో కూడా ఈ ధోరణి కనిపించిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో చాలామంది పెట్టుబడిదారులు బార్లు, నాణేలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్ల(రూ. 88.74 వేల కోట్ల) విలువైన రికార్డు బంగారం కొనుగోళ్లు జరిగాయి. మొత్తం వినియోగంలో బార్లు, నాణెల వాటా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి పెరిగాయని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గురువారం ప్రకటనలో తెలిపింది. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడం, కేటాయింపులను పెంచడం వలన బంగారం ప్రధాన ఆస్తిగా మారింది. తక్కువ పెట్టుబడి పెట్టాలని భావించే వారిలో కూడా ఈ ధోరణి కనిపించిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ అన్నారు. రాబోయే త్రైమాసికాలలోనూ బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. డబ్ల్యూజీసీ ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయంగా బంగారం పెట్టుబడుల డిమాండ్ 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా కూడా 67 శాతం పెరిగి రూ. 9 లక్షల కోట్లకు పెరిగింది. రికార్డు స్థాయి ధరల కారణంగా ఆభరణాల డిమాండ్ 31 శాతం తగ్గి 117.7 టన్నులకు చేరుకుంది. మొత్తం బంగారం వినియోగం కూడా 16 శాతం తగ్గి 209.4 టన్నులుగా నమోదైంది. కాగా, ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలో 10 గ్రాములు రూ. 1,32,294 చేరిన సంగతి తెలిసిందే. గతేడాది 21 శాతం, 2025లో 56 శాతం ధరలు పెరిగాయి. ప్రస్తుతం, గురువారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం రూ. 1,21,560 వద్ద ఉంది.






