- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: అమెరికా టారిఫ్ కారణంగా భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఏడీబీ
టారిఫ్ ప్రభావం వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో వృద్ధి కొంత తగ్గే అవకాశం ఉందని ఏడీబీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: తొలి త్రైమాసికంలో 7.8 శాతం బలమైన వృద్ధి ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 6.5 శాతానికి పరిమితమవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మంగళవారం తెలిపింది. ముఖ్యంగా భారత ఎగుమతులపై అమెరికా విధించిన కొత్త టారిఫ్ వృద్ధి నెమ్మదించేందుకు కారణమని ఏడీబీ అభిప్రాయపడింది. టారిఫ్ ప్రభావం వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో వృద్ధి కొంత తగ్గే అవకాశం ఉందని ఏడీబీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం వ్యయం మెరుగ్గా ఉండటం, వినియోగం పుంజుకోవడంతో 2025-26 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ద్వితీయార్థంలో ఇది తగ్గవచ్చు. దేశీయంగా గిరాకీ పటిష్టంగా ఉండటంతో సేవల రంగం ఎగుమతులపై టారిఫ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడమే కాకుండా ఇవి జీడీపీలో తక్కువ వాటా ఉండటం కలిసి రావొచ్చు. మరోవైపు, యూనియన్ బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటును 4.4 శాతంగా ప్రభుత్వం తెలిపింది. కానీ, ఆ సమయంలో జీఎస్టీ తగ్గింపు ప్రస్తావన లేదు. ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పన్నుల ఆదాయం క్షీణించడమే కాకుండా, ప్రభుత్వం వ్యయం పెరుగుతుంది. ద్వారా ద్రవ్యలోటు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.7 శాతం వరకు ఉండవచ్చని వెల్లడించింది.






