- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: మార్చి కల్లా 4 ట్రిలియన్ డాలర్లు దాటనున్న భారత ఆర్థికవ్యవస్థ
ప్రస్తుతం భారత్ 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే భారత ఆర్థికవ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భౌగోళిక రాజకీయాలు భారీ కుదుపులకు లోనవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రపంచ సవాళ్ల మధ్య ఆర్థిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత్ 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. వచ్చే మార్చి నాటికి 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి దేశ ఆర్థికవ్యవస్థను గ్రీన్ ఎనర్జీ, ఇంధన పరివర్తన, పర్యావరణం, వాతావరణ మార్పులను, వాతావరణ అస్థిరతను ఎదుర్కోవడానికి అనుగుణంగా మన ప్రాధాన్యతలు ఉండాలని ఆయన సూచించారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల, ముఖ్యంగా వ్యవసాయం, పర్యావరణం, తీరప్రాంతాలు మొదలైన వాటిపై కలిగే పరిణామాల గురించి భారత్‌కు బాగా తెలుసునని నాగేశ్వరన్ అన్నారు. అందుకే 2070 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి దేశం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.






