- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: ఈ ఏడాది భారత వృద్ధి 6.5 శాతం: సీఐఐ
ఇంధనం, రవాణా, లోహాలు, రసాయనాలు, ఆతిథ్యం వంటి రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ సమస్యల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని కొనసాగగలదని సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పురి అన్నారు. పెరుగుతున్న వాణిజ్య సవాళ్ల నేపథ్యంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి దేశం కీలక వాణిజ్య భాగస్వాములతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ఇంధనం, రవాణా, లోహాలు, రసాయనాలు, ఆతిథ్యం వంటి రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెట్టుబడులకు కొంత అవరోధం ఏర్పడవచ్చు. ఇది స్వల్పకాలమే, ఆ తర్వాత పరిస్థితులు సాధారణంగా మారతాయని సంజీవ్ పూరి వివరించారు. ఈ కారణంగా దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.5 శాతంగా భావిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది, ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తోంది. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయాపు పన్ను పరిమితి పెంచింది. దీనివల్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. దీనికి తోడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.






