Used Cars: ఐదేళ్లలో రెట్టింపు కానున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్

by S Gopi |

పెరుగుతున్న ఆదాయాలు, తక్కువ ధరలు, యూజ్డ్ కార్ల పట్ల వినియోగదారుల ధోరణి సానుకూలంగా మారుతుండటం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నివేదిక అభిప్రాయపడింది.

Used Cars: ఐదేళ్లలో రెట్టింపు కానున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 35 బిలియన్ డాలర్లు(రూ. 3.32 లక్షల కోట్లు) ఉన్న ఈ మార్కెట్ మరో ఐదేళ్లలో దాదాపు 70 బిలియన్ డాలర్ల(రూ. 6.65 లక్షల కోట్ల)కు చేరుకోవచ్చని ప్రముఖ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. పెరుగుతున్న ఆదాయాలు, తక్కువ ధరలు, యూజ్డ్ కార్ల పట్ల వినియోగదారుల ధోరణి సానుకూలంగా మారుతుండటం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్న భారత సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్, ఈ దశాబ్దం చివరికి అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద మార్కెట్‌గా మారే అవకాశం ఉందని అంచనా. గతంలో ప్రజలు 7-8 ఏళ్లకు కార్లను మార్చేవారు, ఇప్పుడు 4-5 ఏళ్లకే మార్చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, టైర్-1 పట్టణాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, కొత్త మోడళ్ల లాంచ్‌లు పెరగడం, ప్రీమియం వాహనాలపై ఆసక్తి వంటి అంశాలన్నీ కలిసి సెకండ్ హ్యాండ్ కార్ల సరఫరాను పెంచాయని నివేదిక పేర్కొంది.

Next Story