- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: సెప్టెంబర్‌లో 10-20 శాతం ఎక్కువ రష్యా చమురు కొంటున్న భారత్
ఎగుమతిదారులు ముడి చమురును బ్యారెల్‌కు 2-3 డాలర్ల తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా చమురు కొంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అధిక సుంకాలను అమలు చేశారు. అయితే, వాణిజ్య పరిస్థితుల దృష్ట్యా ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా సెప్టెంబర్ నెలలోనూ రష్యా నుంచి మరింత ఎక్కువ చమురును కొనే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నట్టు రాయిటర్స్ పేర్కొంది. ఆగష్టులో కొన్న స్థాయిలతో పోలిస్తే వచ్చే నెలలో 10-20 శాతం ఎక్కువ చమురు కొనవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని అనేక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. దానివల్ల ప్రాసెసింగ్ సామర్థ్యం తగ్గించడంతో రష్యా వద్ద ఎక్కువ చమురు అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఎగుమతిదారులు ముడి చమురును బ్యారెల్‌కు 2-3 డాలర్ల తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగానే భారత చమురు సంస్థలు ఎక్కువ చమురును కొననున్నట్టు సమాచారం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా నాటో దేశాలు 2022లో ఆంక్షలు విధించాయి. దాంతో సరఫరాల విషయంలో భారత్ రష్యాకు అతిపెద్ద చమురు వినియోగదారుగా మారింది. చమురు చౌకగా మారడంతో భారతీయ సంస్థలకు ఖర్చులు తగ్గాయి. అయితే, రష్యాతో భారత్ వాణిజ్యం వల్ల ఉక్రెయిన్‌తో యుద్ధానికి పరోక్ష మద్దతు లభిస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనదేశ ఎగుమతులపై సుంకాలను 50 శాతం వరకు పెంచారు. కాగా, ఆగష్టు నెలకు సంబంధించి 20వ తేదీ వరకు భారత్ రోజుకు 15 లక్షల బ్యారెళ్ల రష్యా చమురును దిగుమతి చేసుకున్నట్టు డేటా పేర్కొంది.






