Economy: 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

by S Gopi |

ఇతర దేశాల నుంచి నమ్మకాన్ని పొందుతున్నామని, ప్రపంచ అవసరాల ఆధారంగా దేశ వాణిజ్య, పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నట్టు గోయల్ తెలిపారు

Economy: 2028 నాటికి 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను నిర్మించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఎకనామిక్ కోఆపరేషన్ (జీఈసీ) సమ్మిట్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి.. భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పటిష్టమైన భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాల విషయంలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇతర దేశాల నుంచి నమ్మకాన్ని పొందుతున్నామని, ప్రపంచ అవసరాల ఆధారంగా దేశ వాణిజ్య, పెట్టుబడులను ప్లాన్ చేస్తున్నట్టు గోయల్ తెలిపారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం తొమ్మిది వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలు నమ్మకం, పరస్పర ప్రయోజనంపై ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భవిష్యత్ వృద్ధి కోసం ఉద్దేశించినవి, ఇతర దేశాలు భారత అభివృద్ధిలో భాగం కావడానికి అవకాశం ఇస్తాయని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ఆయన అన్నారు. అవి నమ్మకం, సామర్థ్యం. ఈ ఒప్పందాలపై సంతకం చేసే సమయంలోనూ ప్రభుత్వం ముఖ్యమైన రంగాలను రక్షిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు.

రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థికవ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతుందని గోయల్ అన్నారు. 2047 నాటికి దేశ ఆర్థికవ్యవస్థకు 26 ట్రిలియన్ డాలర్లను జోడిస్తుంది. దేశ చరిత్రలో ఈ రకమైన వేగవంతమైన వృద్ధి ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వాలు టాయిలెట్లు వంటి ప్రాథమిక అవసరాలపై తగినంత దృష్టి పెట్టలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అందరి జీవన నాణ్యతను మెరుగుపరచడం, అందరినీ కలుపుకునేలా కృషి చేసిందని ఆయన వెల్లడించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలలో జరుగుతున్న మార్పులను పీయూష్ గోయల్ ప్రస్తావించారు. 5జీ ఇంటర్నెట్ మారుమూల ప్రాంతాలకు కూడా చేరిందని, మనదేశం ఇప్పుడు 500 గిగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆర్థిక దౌత్యం అంటే దూరంగా ఉండటానికి బదులుగా బిజినెస్ లీడర్లు, ఇంటర్నేషనల్ పార్ట్‌నర్స్ దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏ దేశమైనా ఇకపై ఒంటరిగా అభివృద్ధి చెందలేవని, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

Next Story