Mercedes-Benz India : అమెరికా వెలుపల భారత్‌లో తొలి జీఎల్ఎస్ మేబ్యాక్ తయారీ

by S Gopi |

ఈ నిర్ణయంతో ఈ కారు ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపడుతున్న ఒకే ఒక దేశంగా భారత్ నిలుస్తుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Mercedes-Benz India : అమెరికా వెలుపల భారత్‌లో తొలి జీఎల్ఎస్ మేబ్యాక్ తయారీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన ఆల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ మోడల్ జీఎల్ఎస్ మేబ్యాక్‌ను భారత్‌లో తయారు చేయడం ప్రారంభిస్తామని బుధవారం ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో ఈ కారు ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపడుతున్న ఒకే ఒక దేశంగా భారత్ నిలుస్తుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. గతేడాది కంపెనీ అల్ట్రా లగ్జరీ పోర్ట్‌ఫోలియోలో మేబ్యాక్‌కు భారత మార్కెట్ ప్రపంచంలోనే టాప్-5 మార్కెట్లలో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలోనే వీటి తయారీని స్థానికంగా చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ చెప్పారు. దీనివల్ల ఈ మోడల్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 3.17 కోట్ల నుంచి రూ. 2.75 కోట్లకు తగ్గుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మేబ్యాక్ మోడళ్లకు భారత్‌తో పాటు చైనా, అమెరికా, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలు కీలక ఐదు మార్కెట్లుగా ఉన్నాయి. 2026లోనూ కంపెనీ కొత్తగా 12 మొడళ్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా ధరల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఈ ఏడు లగ్జరీ కార్ల విభాగం మెరుగైన వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.

Next Story