- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CCTV: ఏప్రిల్ 1 నుంచి చైనా సీసీటీవీల నిషేధం
ఇందులో భాగంగా, ఏప్రిల్ 1 నుంచి చైనాకు చెందిన వీడియో నిఘా కంపెనీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం, విదేశీ నిఘా సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఏప్రిల్ 1 నుంచి చైనాకు చెందిన వీడియో నిఘా కంపెనీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్‌తో లింక్ అయిన చైనా సీసీటీవీ కెమెరాల విక్రయాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ మేరకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దీనివల్ల మనదేశంలో ఎక్కువ మార్కెట్ ఉన్న హిక్‌విజన్, దాహువా, టీపీ-లింక్ వంటి కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దేశ రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న కారణంతో ఈ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇంటర్నెట్‌తో పనిచేసే అన్ని నిఘా పరికరాలను దేశీయంగా విక్రయించే ముందు, అవి కఠిన ధృవీకరణ, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇకపై దేశంలో ప్రతి సీసీటీవీ తయారీ కంపెనీ కూడా తమ ఉత్పత్తులను తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి.






