- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: దేశీయ మైనింగ్ ద్వారా బంగారం ధరలను నిర్ణయించే దేశంగా భారత్
దేశం వికసిత్ భారత్-2047 లక్ష్యాలను సాధించడంలో మైనింగ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బంగారం మార్కెట్లో ధరలను నిర్ణయించే దేశంగా భారత్ మారడానికి సిద్ధంగా ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకునే దేశంగా ఉన్నాం. అయితే, దేశీయ మైనింగ్ ద్వారా వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ డిమాండ్‌లో దాదాపు 20 శాతం ఇక్కడే లభిస్తుందని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశారు. శుక్రవారం భారత చాంబర్ ఆఫ్ కామర్స్ (సీసీఐ) నిర్వహించిన రత్నాభరణాల సమావేశంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈఓ సచిన్ జైన్ మాట్లాడుతూ.. దేశం వికసిత్ భారత్-2047 లక్ష్యాలను సాధించడంలో మైనింగ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మైనింగ్ వల్ల భారతీయ బంగారాన్ని ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, ఉపాధి, పెట్టుబడులు పెరుగుతాయని సచిన్ జైన్ తెలిపారు. ముఖ్యంగా మన వద్ద ఎక్కువ సంఖ్యలో గనులు లేకపోవడం, గోల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం మూలంగా భారత్ ఇప్పటివరకు ధరలపై నిర్ణయాధికారాన్ని పొందలేదు. ప్రస్తుతం లండన్ బులియన్ మార్కెట్ బంగారం ధరలను నిర్ణయిస్తున్నది. అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), బ్యాంకింగ్ వ్యస్థలో జరుగుతున్న మార్పుల ద్వారా పసిడి ధరలను నిర్ణయించనున్నామని చెప్పారు. పారదర్శకత, బాధ్యత మాత్రమే కాకుండా పూర్తిగా పసిడి వ్యవస్థకు ఆధారం అవుతామన్నారు. అంతేకాకుండా మరో రెండు మూడేళ్లలో ప్రపంచ ఆభరణాలకు కేంద్రంగా భారత్ నిలుస్తుందని సచిన్ జైన్ పేర్కొన్నారు.






