E-Commerce Moratorium: శాశ్వత ఈ-కామర్స్ టారిఫ్ మారటోరియంపై భారత్ విముఖత

by S Gopi |

ఈ నిబంధన కారణంగా ఇతర దేశాలకు చెందిన ఏదైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు, దిగుమతి పన్ను ఉండదు.

E-Commerce Moratorium: శాశ్వత ఈ-కామర్స్ టారిఫ్ మారటోరియంపై భారత్ విముఖత
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఉత్పత్తులపై కస్టమ్స్ పన్ను (టారిఫ్) విధించే ప్రపంచ ఒప్పందాన్ని పొడిగించడంపై భారత్ సానుకూల వైఖరిని వ్యక్తం చేసింది. అయితే, ఇదే సమయంలో డిజిటల్ వాణిజ్యాన్ని శాశ్వతంగా పన్ను లేకుండా చేయాలన్న అమెరికా ఒత్తిడిని వ్యతిరేకిస్తోంది. ఈ-కామర్స్ టారిఫ్ మారటోరియం అని పిలిచే ఈ నిబంధన 1998 నుంచి అమల్లో ఉంది. డిజిటల్ ఉత్పత్తుల పరిధిలోకి వచ్చే నెట్‌ఫ్లిక్స్, ఇతర మూవీ స్ట్రీమింగ్, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌లు, ఈ-బుక్స్, గేమ్స్ వంటి డిజిటల్ ఉత్పత్తులపై వివిధ దేశాలు కస్టమ్స్ సుంకాలు విధించకుండా ఈ నిబంధన కాపాడుతుంది. ఈ నిబంధన కారణంగా ఇతర దేశాలకు చెందిన ఏదైనా డౌన్‌లోడ్ చేసినప్పుడు, దిగుమతి పన్ను ఉండదు.

ఈ టారిఫ్ విషయంలో మారటోరియంను తాత్కాలికంగా, మరో రెండేళ్లపాటు పొడిగించడానికి భారత్ సుముఖంగా ఉంది. అయితే, ఈ నిబంధనను శాశ్వతం చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. శాశ్వత టారిఫ్ నిషేధం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గిస్తుంది, విధానపరమైన సౌలభ్యాన్ని పరిమితం చేస్తుంది, దేశీయ డిజిటల్ పరిశ్రమల వృద్ధిని ప్రభావితం చేస్తుందని భారత్ చెబుతోంది. కానీ, శాశ్వత నిషేధం లేదా తాత్కాలిక నిషేధాన్ని పొడిగించాలని అమెరికా ఆశిస్తోంది. ఈ వ్యవహారంలో అభివృద్ధి చెందిన దేశాలకు ప్రస్తుత నిబంధన అనుకూలంగా ఉంది. కానీ, శాశ్వత నిషేధం వల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భవిష్యత్తులో డిజిటల్ దిగుమతులపై పన్ను విధించే అవకాశాన్ని కోల్పోతాయి. కాబట్టి, సమాన అవకాశాలు ఉండాలంటే, డిజిటల్ వాణిజ్యాన్ని శాశ్వతంగా పన్ను లేకుండా చేయడానికి బదులుగా, 2 ఏళ్లు పొడిగించేందుకు సిద్ధమని భారత్ తెలిపింది. దీనివల్ల భవిష్యత్తులో పన్నుల విధానాలపై నియంత్రణ ఉంటుందని పేర్కొంది.

Next Story