- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ ఆశలు
యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం భారత్ ఎదుర్కొంటున్న ప్రతికూలతలను సానుకూలంగా మార్చగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా దేశం వెలుపల నష్టాలను తగ్గించవచ్చని, తద్వారా ఎగుమతులు పెరిగేందుకు వీలుంటుందని భారత్ ఆశిస్తోంది. ఈ కారణంగానే భారత ప్రభుత్వం అమెరికాతో చర్చలను వేగవంతం చేయాలని, మొదటి దశ ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రతికూలతలను సానుకూలంగా మార్చగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఆర్థిక సమీక్షలో పేర్కొంది. భారత్‌కు ప్రస్తుతం పునరుద్ధరించాల్సిన వాణిజ్యంలో అడ్డంకులు ఉన్నాయి. ఇవి కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో అమెరికాతో ఒప్పందం విజయవంతం చేయడం ద్వారా భారత్‌కు వెలుపల సమస్యలను పరిష్కారం లభిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లకు సంబంధించి తాత్కాలికంగా వాయిదా ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారత దిగుమతులపై 26 శాతం సుంకం వ్యవహారం కొంత నష్టాన్ని కలిగించవచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రస్తుతం భారత్ మూడు దశల్లో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. జూలై నాటికి మొదటి దశ ఒప్పందం పూర్తవ్వొచ్చని భావిస్తున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గత వారం రోజులుగా వాషింగ్టన్‌లోనే ఉన్నారు.






