చెల్లింపుల కోసం రూపే, మిర్ కార్డుల వినియోగంపై భారత్, రష్యా చర్చలు!

by Disha Web Desk 13 |
చెల్లింపుల కోసం రూపే, మిర్ కార్డుల వినియోగంపై భారత్, రష్యా చర్చలు!
X

న్యూఢిల్లీ: రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో అవాంతరాలు లేని చెల్లింపుల కోసం భారత్-రష్యాలు రూపే, మిర్ కార్డుల వినియోగానికి అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగిన ఉన్నత స్థాయి అంతర్గత ప్రభుత్వం కమిషన్ సమావేశంలో దీని గురించి చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్-రష్యాలు రూపే, మిర్ కార్డుల వినియోగం కోసం అనుమతించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు, అందుకవసరమైన చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి.

పరస్పర అంగీకారం కుదిరితే భారత, రష్యా ప్రజలు భారత రూపాయి, రష్యన్ రూబుల్‌లలో చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురొవ్‌కు కూడా దీనికి అంగీకారం తెలిపారు. భారత్‌కు చెందిన యూపీఐ, బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన ఎఫ్‌పీఎస్ మధ్య పరస్పర సహకారానికి అవకాశాలను అన్వేషించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ నుంచి స్విఫ్ట్ నెట్‌వర్క్ ద్వారా విదేశాలకు చెల్లింపులు జరుగుతున్నాయి.

Next Story

Most Viewed