IPPB: లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణకు పీఎన్‌బీ మెట్‌లైఫ్‌తో ఇండియా పోస్ట్ భాగస్వామ్యం

by S Gopi |

ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికి జీవిత బీమా అందించడం లక్ష్యంగా ఉంటుందని ఐపీపీబీ పేర్కొంది

IPPB: లైఫ్ ఇన్సూరెన్స్ విస్తరణకు పీఎన్‌బీ మెట్‌లైఫ్‌తో ఇండియా పోస్ట్ భాగస్వామ్యం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అందరికీ జీవిత బీమా అందించేందుకు పీన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తెలిపింది. ఐపీపీబీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఐపీపీబీకి చెందిన 650 బ్యాంకింగ్ ఔట్‌లెట్‌లు, 11 కోట్ల కస్టమర్ల నెట్‌వర్క్‌కు అందుబాటులో ఉండనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలోని ప్రతి ఇంటికి జీవిత బీమా అందించడం లక్ష్యంగా ఉంటుందని ఐపీపీబీ పేర్కొంది. అంతేకాకుండా తమ కస్టమర్లకు ఆర్థికంగా ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు కలలను సాకారం చేయడంలో సహకారం అందించనున్నట్టు వివరించింది. ఇండియా పోస్ట్ లక్ష్యం దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడం. పీఎన్‌బీ మెట్‌లైఫ్‌తో భాగస్వామ్యం ద్వారా దీన్ని మరింత వేగంగా విస్తరించేందుకు వీలవుతుంది. ఇండియా పోస్ట్ వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా జీవిత బీమా పాలసీలను అందించనున్నాం. అవి తమ కస్టమర్ల ఆర్థిక భద్రతను అందిస్తాయని ఐపీపీబీ సీఈఓ, ఎండీ ఆర్ విశ్వేశ్వరన్ చెప్పారు.

Next Story