- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India Exports: పాక్‌కు వెళ్లే ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ ఎగుమతులను అరికట్టే యోచనలో భారత్
శ్రీలంక, సింగపూర్, యూఏఈ లాంటి దేశాల గుండా సుమారు 10 బిలియన్ డాలర్ల భారతీయ వస్తువులు పాకిస్తాన్‌కు చేరుతున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడితో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దారుణ ఘటనలో 26 మంది మరణించడం, మరికొంతమంది గాయాలపాలు కావడంతో భారత ప్రభుత్వం దాయాదిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలను వెల్లడించగా, తాజాగా ఆ దేశానికి ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువులను కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి వాణిజ్యం జరగనప్పటికీ, శ్రీలంక, సింగపూర్, యూఏఈ లాంటి మధ్యవర్తిత్వ దేశాల గుండా సుమారు 10 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 85 వేల కోట్లకు పైనే) భారతీయ వస్తువులు పాకిస్తాన్‌కు చేరుతున్నాయి. పాకిస్తాన్‌కు వెళ్లే మన ఉత్పత్తుల్లో రత్నాభరణాలు, బంగారం, ఈ-కామర్స్ ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి. నేరుగా భారత్ నుంచి కాకుండా మరో దేశం నుంచి రీ-ఎక్స్‌పోర్ట్ కావడం వల్ల వాటి ఖరీదు కూడా పెరుగుతాయి. అయినప్పటికీ భారతీయ ఉత్పత్తులకు పాకిస్తాన్‌లో అధిక డిమాండ్ ఉంటుంది.
ఇప్పటికే భారత విమానాలకు ఎయిర్‌స్పేస్‌ను నిషేధించిన పాక్‌కు గట్టిగా బదులిచ్చేందుకు భారత ప్రభుత్వం కూడా ప్రతీకారంగా ఎయిర్‌కార్గో కారిడార్‌ను మూసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు పాక్ విమానయాన సంస్థలకు మనదేశ గగనతలాన్ని కూడా మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ నౌకలు కూడా భారత పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించే దిశగా చర్యలకు దిగే అవకాశాలున్నాయి.
ఇదే సమయంలోనే మన దేశం నుంచి పాకిస్తాన్‌కు ఎగుమతి అయ్యే ఔషధాలు, ఇతర ఫార్మా ఉత్పత్తుల గురించి వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్)ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆదేశించింది.
పాక్‌కు ఎగుమతులు ఎలా అవుతున్నాయి
భారత్‌లో తయారైన ఉత్పత్తి మూడో దేశంలోకి చేరినప్పుడు, కొన్ని స్వతంత్ర సంస్థలు వాటిని కస్టమ్స్ సుంకాలు అమలు కాని బంధిత గిడ్డంగులలో నిల్వ చేస్తాయి. ఆ తర్వాత వాటిని భారతీయ ఉత్పత్తులుగా కాకుండా, ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయో ఆ దేశ ఉత్పత్తిగా తిరిగి ప్యాకేజ్ చేస్తారు.






