- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Basmati Rice: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య భారీగా పెరిగిన బాస్మతి బియ్యం ధరలు
పార్బాయిల్డ్ బాస్మతి బియ్యం 1509 రకం హోల్‌సేల్ ధర గత 15 రోజుల్లో కిలోకు రూ. 53 నుంచి రూ. 59కి పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన పదిహేను రోజుల్లో బాస్మతి బియ్యం ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. దీంతో గడిచిన ఆరు నెలలుగా తగ్గుముఖం పట్టిన ధరలు తిరిగి పెరుగుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా మార్కెట్ల నుంచి బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరిగింది. బాస్మతి బియ్యం ఉత్పత్తిలో భారత్‌తో పాటు పాక్ అతిపెద్ద ఎగుమతి దేశాలుగా ఉండటమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎక్కువ వినియోగించే పార్బాయిల్డ్ బాస్మతి బియ్యం 1509 రకం హోల్‌సేల్ ధర గత 15 రోజుల్లో కిలోకు రూ. 53 నుంచి రూ. 59కి పెరిగింది. బిర్యానీ వంటలో వాడే స్టీండ్ బాస్మతి బియ్యం రూ. 62-63 నుంచి రూ. 69కి పెరిగింది. రిటైల్ మార్కెట్లోనూ బిర్యానీలో వాడే సెల్లా రకం కిలో రూ. 75కి, ప్రీమియం రకం రూ. 80కి చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సరఫరా కోసం కనీస ఎగుమతి ధరను ప్రవేశపెట్టడంతో బాస్మతి బియ్యం ధరలు తగ్గాయి. దీనివల్ల చాలా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ నుంచి కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత భారత్ ఆ పరిమితిని తొలగించింది. కనీ, అప్పటికే పాకిస్తాన్‌కు ఎక్కువ ఆర్డర్లు చేరడంతో మన దేశంలో ధరలు తగ్గాయి. దీంతో సరఫరా ఇబ్బందులు ఉండొచ్చని సందేహాల మధ్య పలు దేశాల కొనుగోలుదారులు తిరిగి భారత్ నుంచి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
భారత్, పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల వల్ల బాస్మతి బియ్యం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు పెరిగాయి. ఫలితంగా ధరలు పెరుగుతాయని ప్రపంచ బియ్యం మార్కెట్ వర్గాల్లో నెలకొందని హర్యానాకు చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారు ఎల్ఆర్ఎన్‌కె డైరెక్టర్ గౌతమ్ మిగ్లానీ అన్నారు. ఇది పశ్చిమాసియాలోనే కాకుండా మద్యప్రాచ్యంలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు.
సౌదీ అరేబియా, ఇరాన్, యెమెన్ వంటి దేశాలు భారత్ నుంచి ఎక్కువ బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్ అమలును 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇవ్వడంతో అమెరికా కొనుగోలుదారులు కూడా భారత్ నుంచి వీలైనంత ఎక్కువ బాస్మతి బియ్యం కొనాలని భావిస్తున్నారు. కాగా, 2024లో భారత్ నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి జరిగింది. దీనివల్ల రూ. 48,389 కోట్ల విదేశీ మాదక ద్రవ్యాన్ని ప్రభుత్వం ఆర్జించిందని అగ్రి, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీఈడీఏ) పేర్కొంది.






