Airlines: విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట

by S Gopi |

విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను మూడు నెలల పాటు 25 శాతం మేర తగ్గించాలని భారత విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది.

Airlines: విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం ఉపశమనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను మూడు నెలల పాటు 25 శాతం మేర తగ్గించాలని భారత విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. తగ్గింపు ఛార్జీలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. విమానాశ్రయాలు విధించే కొన్ని ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రభుత్వాన్ని కోరాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలుగా ఉన్న ఇండిగో, ఎయిర్ఇండియాకు ఎక్కువ నష్టం ఎదురైంది. ఇప్పటికే ఈ సంస్థలు పాకిస్థాన్ గగనతలం నిషేధం వల్ల లాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఛార్జీలను తగ్గించే చర్యలు తీసుకుంది.

Next Story