- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్: పియూష్ గోయల్
మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం క్వాంటం మార్పుపై దృష్టి పెట్టింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే దిశగా పయనిస్తోంది. రాబోయే మూడు సంవత్సరాలలో ఈ మైలురాయిని చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. బుధవారం మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎంసీసీఐ) నిర్వహించిన వెబ్‌నార్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి.. 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించగలదు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం, వ్యాపార సంఘాలు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాలతో పాటు మొత్తం 140 కోట్ల మంది భారతీయులను కలుపుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'వికసిత్ భారత్ 2047' దార్శనికతతో ముందుకు వెళ్తున్నారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం క్వాంటం మార్పుపై దృష్టి పెట్టింది. వృద్ధిపై మాత్రమే కాకుండా సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. దేశాన్ని శక్తివంతమైన ఆర్థికవ్యవస్థగా మార్చే క్రమంలో భారత్‌కు ఉన్న బలహీనతలను సరిదిద్ది ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నామని, ప్రస్తుతం మనదేశం అంతర్జాతీయంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు.
అంతేకాకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధు ఉదాహరణ అని అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో చిక్కుకున్న మన పౌరులను ప్రధాని మోడీ ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చిందన్నారు. భారత్ పటిష్టమైన స్థూల ఆర్థిక పునాది కలిగి ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉంది. రుణాలు ఇచ్చే సామర్థ్యం అధికంగా ఉన్న దేశం మనది.
ద్రవ్యోల్బణం విషయంలోనూ ఇప్పటివరకు చూడని అత్యల్పం 3 శాతానికి తగ్గించగలిగామని పీయుష్ గోయల్ చెప్పారు. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వ వ్యయం పెంచడమే కాకుందా సులభతర వ్యాపారానికి, వ్యాపార నిర్వహణ ఖర్చులకు, కార్మికుల్లో తయారీకి ప్రాధాన్యం కల్పించడం, గ్లోబల్ మార్కెట్ వైపు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో విజయవంతం అయ్యామన్నారు. ఈ క్రమంలో దేశాన్ని డిజిటల్ మార్కెట్‌గా నిలిపేందుకు వచ్చే పదేళ్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు.






