Nvidia: భారత్ ఏఐ ఇన్‌ఫ్రాలో మరిన్ని పెట్టుబడులు అవసరం.. ఎన్విడియా

by S Gopi |

ఇటీవల యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం విదేశీ కంపెనీలకు 20 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ఏఐ విస్తరణకు బలాన్నిస్తుందని శంకర్ త్రివేది అన్నారు.

Nvidia: భారత్ ఏఐ ఇన్‌ఫ్రాలో మరిన్ని పెట్టుబడులు అవసరం.. ఎన్విడియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ టెక్ దిగ్గజం ఎన్విడియా అభిప్రాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్ల(రూ. 10 వేల కోట్ల)కు పైగా ఉన్న పెట్టుబడులను గణనీయంగా పెంచాలని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం విదేశీ కంపెనీలకు 20 సంవత్సరాల ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ఏఐ విస్తరణకు బలాన్నిస్తుందని, ఏఐ మౌలిక సదుపాయాలకు బలమైన పునాదిని అందిస్తుందని ఎన్విడియా ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ శంకర్ త్రివేది అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ స్థాయిలో ఉన్న దిగ్గజ 2,000 సంస్థల్లో 1,800కు పైగా కంపెనీలు దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) కలిగి ఉన్నాయి. వీటిలో 20 లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తుండగా, త్వరలో ఈ సంఖ్య 30 లక్షలకు పెరగనున్నాయి. ప్రతి జీసీసీలకు సొంత స్థానిక ఏఐ ఫ్యాక్టరీ అవసరం ఉంటుంది. దాన్నుంచే ఆయా కంపెనీలు తమ డేటాను, వ్యాపార నిర్వహణ, ఐపీ ద్వారా పనిచేస్తాయి. కాబట్టి, భారత ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ హాలిడే కంపెనీలు అత్యంత కీలకమైన అవకాశమని త్రివేది వెల్లడించారు.

Next Story