Nirmala Sitharaman: భారత్‌కు ప్రపంచ స్థాయి బ్యాంకుల అవసరం ఉంది: నిర్మలా సీతారామన్

by S Gopi |

పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడంపై ఆర్‌బీఐతో కూడా చర్చిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Nirmala Sitharaman: భారత్‌కు ప్రపంచ స్థాయి బ్యాంకుల అవసరం ఉంది: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ప్రపంచ స్థాయి బ్యాంకుల అభివృద్ధి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)తో పాటు బ్యాంకింగ్ రంగ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను కలిపి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులతో మాట్లాడి, వరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో చూడాలి. పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడంపై ఆర్‌బీఐతో కూడా చర్చిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో ఇటీవలి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన నేపథ్యంలో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గత కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కేంద్రం మరో రౌండ్ విలీన ప్రక్రియను చేపట్టే యోచనలో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో కలుపుతూ మెగా విలీన ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను క్రమబద్ధీకరించి, తదుపరి దశ క్రెడిట్ విస్తరణ, ఆర్థిక రంగ సంస్కరణలకు మద్దతు ఇవ్వగల సమర్థవంతమైన సంస్థలను ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశ్యమని తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం)లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వంటి పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చు.

Next Story