- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gig Workers: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరిన ఐఎఫ్ఏటీ
వారికి దక్కాల్సిన అధికారిక హక్కులు, కనీస భద్రత, సంస్థాగత మద్దతు లేకుండా పని చేస్తున్నారని కార్మికుల సంఘం పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: సామాజిక భద్రతా నియమావళి (సీఓఎస్ఎస్)-2020 కింద గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రతా నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరింది. దీనికి సంబధించి మంత్రికి పంపిన లేఖలో.. క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది, హోమ్-సర్వీస్ ప్రొవైడర్లు సహా 2 కోట్లకు పైగా యాప్ ఆధారిత కార్మికులు దేశ డిజిటల్ సేవల ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నారు. అయితే, వారికి దక్కాల్సిన అధికారిక హక్కులు, కనీస భద్రత, సంస్థాగత మద్దతు లేకుండా పని చేస్తున్నారని కార్మికుల సంఘం పేర్కొంది. సీఓఎస్ఎస్-2020 దేశంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులను అధికారికంగా గుర్తించి, జీవిత, డిసేబిలిటీ కవరేజీ, ప్రమాద బీమా, ఆరోగ్య, ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య రక్షణ వంటి ప్రయోజనాలను అందించే మొదటి చట్టంగా రూపొందించారు. అయితే, ఈ చట్టం అమలులోకి వచ్చిన దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి నిర్దిష్ట సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఐఎఫ్ఏటీ తెలిపింది. చట్టం ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లు సరైన సామాజిక రక్షణ లేకుండానే ఉన్నారని లేఖలో పేర్కొంది. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం జాతీయ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం, సోషల్ సెక్యూరిటీ ఫండ్‌ను అమలు చేయడం వంటి కోడ్ నిబంధనలను అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సమాఖ్య పిలుపునిచ్చింది.






