- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Employment: నిరుద్యోగ సమస్య పరిష్కారానికి భారత్ రెండింతలు వృద్ధి చెందాలి
లక్షలాది యువత ఉత్పాదక పనులకు దూరంగా ఇంటికి పరిమితం కావొచ్చు, తద్వారా సామాజిక ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు భారత ఆర్థికవ్యవస్థ ఇప్పుడున్న దానికంటే దాదాపు రెట్టింపు వృద్ధిని సాధించాల్సి ఉంటుందని మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఆర్థికవేత్తలు సూచించారు. లేకుంటే, లక్షలాది యువత ఉత్పాదక పనులకు దూరంగా ఇంటికి పరిమితం కావొచ్చు, తద్వారా సామాజిక ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీన్ని అధిగమించేందుకు భారత్ ప్రతి ఏడాది అసాధారణంగా 12.2 శాతం వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది.
ప్రధానంగా భారత్ రెండు రకాల ఉపాధి సమస్యలను ఎదుర్కొంటోంది. అవి నిరుద్యోగం, తక్కువ ఉపాధి. దీనర్థం.. సరైన ఉద్యోగాలు లభించకపోవడం ఒకటైతే, ఉన్న ఉద్యోగంలో పూర్తిస్థాయి స్కిల్స్‌ని ఉపయోగించుకునే పరిస్థితి లేకపోవడం రెండవది. యువతలో నిరుద్యోగ రేటు 17.6 శాతంగా ఉంది. ఇది ఆసియ ప్రాంతంలోనే అత్యధికం. ముఖ్యంగా వ్యవసాయంలోకి ఎక్కువ మంది చేరుతుండటంతో ఈ రంగంలో నిరుద్యోగ రేటు 17 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. బలమైన పారిశ్రామిక, ఎగుమతుల వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అమలు, స్కిల్స్ అప్‌గ్రేడ్, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం వంటి సంస్కరణలు ఉపాధి పెరిగేందుకు దోహదపడతాయి. ఈ సంస్కరణలు లేకుంటే భారత్ నిరుద్యోగ సమస్యను అధిగమించడం కష్టమని మోర్గాన్ స్టాన్లీ తన నివేదిక పేర్కొంది. ఈ సమస్య కారణంగా ప్రపంచానికే వృద్ధి ఇంజిన్‌గా మారాలనే భారత్ లక్ష్యానికి అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాకుండా హెచ్-1బీ విసా ఖరీదు కావడంతో విదేశాల్లో ఉద్యోగాలు కూడా మరింత ఒత్తిడికి లోనవుతాయని నివేదిక అభిప్రాయపడింది.
ప్రభుత్వం దేశ వృద్ధిని 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్య అంచనా వేసింది. అయితే, ఇప్పటికీ దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన దానికంటే ఇది చాలా తక్కువ. భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్ విధించడం, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా వర్క్ వీసా ఫీజు భారీగా పెరగడం వల్ల ఈ అంచనాపై మరింత సంక్లిష్టత ఏర్పడింది. జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థికవ్యవస్థ అంచనాలను మించి 7.8 శాతం వృద్ధి చెందింది. కానీ ఆ వేగం రాబోయే దశాబ్దంలో శ్రామిక శక్తిలోకి చేరే 8.4 కోట్ల మందికి అవసరమైన దానికంటే చాలా తక్కువ.






