- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LPG Consumption: యుద్ధం కారణంగా దేశంలో 13 శాతం తగ్గిన ఎల్‌పీజీ వినియోగం
ఇది గతేడాది వినియోగించిన 2.729 మిలియన్ టన్నులతో పోలిస్తే 12.8 శాతం తగ్గింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం గణనీయంగా క్షీణించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరా దెబ్బతినడంతో గత నెల ఎల్‌పీజీ వినియోగం ఏకంగా 13 శాతం పడిపోయింది. మార్చిలో ఎల్పీజీ వినియోగం 2.379 మిలియన్ టన్నులుగా నమోదైంది. ఇది గతేడాది వినియోగించిన 2.729 మిలియన్ టన్నులతో పోలిస్తే 12.8 శాతం తగ్గింది. మనం ఎల్పీజీ అవసరాలలో సుమారు 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో అధిక భాగం హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్ ప్రతీకార చర్యల నేపథ్యంలో ఈ జలసంధి మూతబడింది. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి సరఫరాకు అంతరాయం కలగడంతో, ఇంటి అవసరాలకు కావాల్సిన వంటగ్యాస్ లభ్యత కోసం ప్రభుత్వం హోటళ్లు వంటి వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాను తగ్గించింది. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం.. గృహ వినియోగదారులకు విక్రయించిన ఎల్‌పీజీ సిలిండర్లు మార్చిలో 8.1 శాతం తగ్గి 2.219 మిలియన్ టన్నులకు పడిపోగా, గృహేతర వినియోగదారులకు దాదాపు 48 శాతం తగ్గాయి. బల్క్ ఎల్‌పీజీ అమ్మకాలు ఏకంగా 75.5 శాతం తగ్గాయి.






