- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Salary: ఈ ఏడాది 9.1 శాతం జీతాలు పెంచనున్న కంపెనీలు
ఉద్యోగుల పనితీరుపై రేటింగ్‌లోనూ మార్పులు జరిగాయి. అత్యధికంగా 5 పాయింట్ల పనితీరు వచ్చిన ఉద్యోగులకు 2024లో 10 శాతం పెంపు ఇవ్వగా, 2025లో ఇది 7 శాతానికి పరిమితమైంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయంగా కంపెనీలు ఉద్యోగులకిచ్చే జీతాలను 9.1 శాతం మేర పెంచవచ్చని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఇది గతేడాది కంటే స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో సేకరించిన వివరాల ఆధారంగా డెలాయిట్ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం, కొన్నేళ్ల నుంచి చాలా కంపెనీలు జీతాల కోసం తక్కువ నిధులను కేటాయిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కంపెనీల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉంది. ఉద్యోగుల పనితీరుపై రేటింగ్‌లోనూ మార్పులు జరిగాయి. అత్యధికంగా 5 పాయింట్ల పనితీరు వచ్చిన ఉద్యోగులకు 2024లో 10 శాతం పెంపు ఇవ్వగా, 2025లో ఇది 7 శాతానికి పరిమితమైంది. సుమారు 16 శాతం మంది ఉద్యోగులు కింది నుంచి 2 పాయింట్ల పనితీరు రేటింగ్‌ని కలిగి ఉన్నారు.
ఏయే రంగాల్లో ఎంతంటే..
ఎక్కువ జీతం పెంచనున్న రంగాల్లో ఫార్మా 10.1 శాతంతో ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత లైఫ్ సైన్సెస్ 9.9 శాతం, తయారీ 9.8 శాతం, ఆటోమొబైల్స్ 10.3 శాతం, రెన్యూవబుల్ రంగంలో 10.4 శాతం, సెమీకండక్టర్‌లో 10.1 శాతం, ఫైనాన్స్ రంగంలో 9.1 శాతం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో 9.5 శాతం మేర జీతాలు పెరుగుతాయని నివేదిక వివరించింది. ఇదే సమయంలో, గతేడాది ప్రమోషన్లు ఎక్కువగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. 2024లో 12 శాతం ఉద్యోగులు ప్రమోషన్లు పొందగా, గతేడాది ఇది 14 శాతానికి పెరిగింది. అత్యధికంగా తయారీ రంగంలోని వారికి ప్రమోషన్లు లభించాయి. అట్రిషన్ రేటు 17.4 శాతం నుంచి 17.6 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇక, ఐటీ సేవల కంపెనీలు ఈ ఏడాది 6.9 శాతం మాత్రమే పెంపు ఇవ్వనున్నాయి. గతేడాది 7.6 శాతం కంటే తక్కువ. ఐటీ ప్రోడక్ట్స్ కంపెనీలు 9.3 శాతం నుంచి 9.2 శాతం, జీసీసీల్లో 9 శాతం నుంచి 8.8 శాతానికి జీతాల పెంపును ఇస్తాయని నివేదిక పేర్కొంది.






