- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Umbrella: రూ. 100 కంటే తక్కువ ఖరీదైన గొడుగుల దిగుమతిని నిషేధించిన కేంద్రం
దిగుమతులను పరిమితం చేస్తూ, రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న గొడుగులకు (రవాణా, భీమా ఖర్చుతో సహా) మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొడుగుల దిగుమతికి సంబంధించి కనీస ధర రూ. 100గా నిర్ణయించింది. అంటే ఒక్కో గొడుగు రూ. 100 కంటే తక్కువ ధర ఉంటే, వాటిని దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు. దేశీయ గొడుగు తయారీదారులకు మద్దతు ఇవ్వడానికి, చౌక దిగుమతులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వివరాల ప్రకారం, గతంలో గొడుగులను ఉచితంగా దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దిగుమతులను పరిమితం చేస్తూ, రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న గొడుగులకు (రవాణా, భీమా ఖర్చుతో సహా) మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది దిగుమతిదారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. ముందస్తు అధికారం, ఎగుమతి-ఆధారిత యూనిట్లు (ఈఓయూలు), ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు) కింద దిగుమతి చేసుకునే యూనిట్లు ఈ పరిమితి లేకుండా గొడుగులను దిగుమతి చేసుకోవచ్చు.
తాజాగా, 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం గొడుగులపై దిగుమతి సుంకాన్ని ఒక్కో దానికి రూ. 60 లేదా 20 శాతానికి (ఏది ఎక్కువైతే అది)పెంచింది. ఈ నిర్ణయంతో భారత్‌లోకి దాదాపు 96 శాతం దిగుమతి చేసుకునే చైనా గొడుగుల సరఫరాను నియంత్రించవచ్చు. 2023 నాటి డేటా ప్రకారం, మనదేశంలోకి సుమారు 17 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 140 కోట్ల) విలువైన గొడుగులు దిగుమతి అవుతున్నాయి. ఇందులో సుమారు 96 శాతం చైనానే సరఫరా చేస్తోంది. అంటే 15.8 మిలియన్ డాలర్లు(రూ. 130 కోట్ల వరకు) చైనావే ఉండటం గమనార్హం. సాధారణ లెక్కలోంచి చూస్తే, ఒక్కో గొడుగుకు సుమారు రూ. 72-90 సగటు ధరతో దిగుమతి అవుతున్నాయి. అంటే చాలా గొడుగులు అత్యంత తక్కువ ధరలకు దేశంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా దిగుమతులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.






