- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Starups: అత్యధిక నిధులు సమీకరించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానం
భారతీయ స్టార్టప్‌లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియణ్ డాలర్ల(రూ. 1.08 లక్షల కోట్ల) నిధులను సమీకరించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టార్టప్ కంపెనీలు నిధుల సేకరణలో దూసుకెళ్తున్నాయి. ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్సన్ విడుదల చేసిన తాజా ఇండియా టెక్ వార్షిక నిధుల డేటా ప్రకారం, భారతీయ స్టార్టప్‌లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియణ్ డాలర్ల(రూ. 1.08 లక్షల కోట్ల) నిధులను సమీకరించాయి. ఇది 2024-25లో సేకరించిన 14.3 బిలియన్ డాలర్ల(రూ. 13.2 లక్షల కోట్ల)తో పోలిస్తే 18 శాతం తగ్గింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సేకరించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మనదేశం కంటే ముందు అమెరికా, యూకే, చైనా ఉన్నాయి. ముఖ్యంగా ఎర్లీ-స్టేజ్ స్టార్టప్‌లు 33 శాతం ఎక్కువ ఫండింగ్ సాధించాయని ట్రాక్సన్ కో-ఫౌండర్ నేహా సింగ్ తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీ, విస్తరించే అవకాశం కంపెనీలపై ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని నేహా సింగ్ పేర్కొన్నారు. ఎంటర్‌పైజ్ యాప్‌లు అంతకుముందు ఏడాదికి దాదాపు సమానంగా నిధులు పొందగా, ఫిన్‌టెక్ కంపెనీలు 14 శాతం, రిటైల్ రంగం 32 శాతం ఎక్కువ నిధులు దక్కించుకున్నాయి. ఇక, గతేడాది మొత్తం 47 కంపెనీలు ఐపీఓలకు వచ్చాయి. ఇది అంతకుముందు కంటే 52 శాతం అధికం. వాటిలో లెన్స్‌కార్ట్, గ్రోవ్, మీషో వంటి కంపెనీలు ఉన్నాయి.






