- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: భారత జీడీపీ వృద్ధి 6.7 శాతం
2026-27లోనూ అనుకూలమైన పాలసీ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో వృద్ధి 6.8 శాతానికి పెరుగుతుందని అంచనా.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ డిమాండ్, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం వంటి పరిణామాల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.7 శాతం పెరిగే అవకాశం ఉందని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) బుధవారం ప్రకటనలో తెలిపింది. ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్(ఏడీఓ) నివేదిక ప్రకారం, 2026-27లోనూ అనుకూలమైన పాలసీ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో వృద్ధి 6.8 శాతానికి పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించడంతో భారత్ స్థిరమైన వృధిని కొనసాగిస్తుందని ఏడీబీ ఇండియా కంట్రీ హెడ్ మియో ఓకా చెప్పారు. రెగ్యులేటరీ సంస్కరణల ద్వారా దేశీయంగా తయారీ రంగం బలోపేతం అవుతోందని, ఇప్పటికే బలంగా ఉన్న సేవలు, వ్యవసాయ రంగాలకు తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కోసం ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాలు భారత్ సమర్థవంతమైన, బలమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు దోహదపడతాయని మియో ఓకా తెలిపారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం ద్వారా గ్రామీణ ఆదాయాలు పెరుగుతాయని, పట్టణ మధ్యతరగతి, సంపన్న కుటుంబాల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా వినియోగం వృద్ధికి చోదకశక్తిగా మారుతుందని నివేదిక పేర్కొంది.






