- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JaiShankar: వాణిజ్య అడ్డంకులు పెరగడం వల్ల ప్రపంచ వృద్ధికి హానీ
ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని పరిష్కరించడంలో దేశాలు విఫలమవుతున్నాయని..

దిశ, బిజినెస్ బ్యూరో: వాణిజ్యపరమైన ఆంక్షలు, ఆర్థిక విధానాలను రాజకీయం చేయడం ప్రపంచ వృద్ధికి సహాయపడటానికి బదులు ఎక్కువ హానీ కలిగిస్తాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. సోమవారం బ్రిక్స్ దేశాల వర్చువల్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరపున మాట్లాడిన ఆయన.. ప్రపంచ ఆర్థిక రంగంలో నేడు వాణిజ్య విధానాలు, మార్కెట్ యాక్సెస్ ప్రధాన సమస్యలు. స్థిరమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచానికి నిర్మాణాత్మక, సహకార విధానాలు అవసరం. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని పరిష్కరించడంలో దేశాలు విఫలమవుతున్నాయని, ప్రపంచ వాణిజ్యంలో న్యాయం, పారదర్శకత తప్పనిసరి అన్నారు. మార్కెట్ అవకాశాలను సమానంగా అందించకపోవడం మూలంగా చాలా దేశాలు నష్టపోతున్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. అడ్డంకులను సృష్టించడం, లావాదేవీలను క్లిష్టతరం చేయడం సహాయపడవు. వాణిజ్య చర్యలను వాణిజ్యేతర విషయాలకు అనుసంధానం చేయడం కూడా సహాయపడదని జైశంకర్ అన్నారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా వర్చువల్‌గా హాజరైన ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆదర్శంగా ముందుకు సాగాలని చెప్పారు. బ్రిక్స్ తన సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని సమీక్షించడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. భారత్ విషయానికి వస్తే, కొన్ని బ్రిక్స్ దేశాలతో భాగస్వామ్య లోటు కనిపిస్తోంది. అందుకు వేగవంతమైన పరిష్కారాల కోసం ఒత్తిడి చేస్తున్నామని పేర్కొన్నారు.






