- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Taxpayers: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. వేగవంతమైన ఐటీఆర్ రీఫండ్లు
ఐటీఆర్ ప్రక్రియలో ఇది అతిపెద్ద మార్పుగా భావించవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆదాయపన్ను చెల్లించేవారికి భారీ ఊరట లభించనుంది. సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలు చేసిన తర్వాత రీఫండ్ల కోసం చాలాకాలం వేచి ఉండాల్సి రావడం సాధారణం. అయితే, ఇది గతం కానుంది. అందరికీ కాకపోయినా, చాలామందికి ఇకపై త్వరితగతిన రీఫండ్లు అందే అవకాశం ఉంది. తాజాగా ప్రస్తుత ఏడాదికి సంబంధించి కొందరు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను ఈ-ఫైలింగ్ చేసిన 4 గంటల్లోనే రీఫండ్లను పొందినట్టు చెప్పారు. దీంతో ఇకపై ఐటీఆర్ ప్రక్రియ అత్యంత వేగవంతం జరగనుంది. ఐటీఆర్ ప్రక్రియలో ఇది అతిపెద్ద మార్పుగా భావించవచ్చు. ఇప్పటివరకు అంటే గత 12-13 ఏళ్లుగా రీఫండ్లకు 90 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది. అయితే, ప్రస్తుత అసెస్‌మెంట్ ఏడాదిలో కొంతమంది పన్ను చెల్లింపుదారులు తన రిటర్నులను దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే పన్ను వాపసులను పొందినట్టు చెప్పారు. ఈ విషయాన్ని నోయిడాకు చెందిన అరుణ్ ప్రకాశ్ అనే వ్యక్తి ధృవీకరించారు. తాను ఈ-ఫలింగ్ పోర్టల్‌లో ఫారం-1 నుంచి రిటర్నులు దాఖలు చేసిన 4 గంటల్లోనే రీఫండ్ పొందినట్టు చెప్పారు. మరికొందరు కూడా ఇలాగే ఒకరోజులోనే రీఫండ్లు వచ్చాయని స్పష్టం చేశారు. ఇందుకు ప్రధానంగా, డిజిటల్ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన రిటర్నుల ప్రాసెసింగ్, ఆటోమేటెడ్‌గా ధృవీకరణల ద్వారా సాధ్యమైంది. అంతేకాకుండా ఇదివరకు ఎక్సెల్ సిస్టమ్ స్థానంలో జేఎస్ఓఎన్ ఫార్మాట్‌ను తీసుకురావడం వల్ల డేటా రీడింగ్ మరింత వేగవంతమైంది.






