India: ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణతో భారత్‌కు మేలు

by S Gopi |   (  Updated:2026-04-29 14:08:23  IST  )

భారత్ కోణంలో, యూఏఈతో ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఈ పరిణామాన్ని పూర్తిగా ప్రతికూలంగా కాకుండా, కొంతవరకు సానుకూలంగా ఉంచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

India: ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణతో భారత్‌కు మేలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వైదొలగడం ప్రపంచ ఇంధన మార్కెట్లలో కొత్త చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం మార్కెట్లను అస్థిరపరుస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది స్పష్టంగా తెలియదని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. అయితే భారత్ కోణంలో, యూఏఈతో ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఈ పరిణామాన్ని పూర్తిగా ప్రతికూలంగా కాకుండా, కొంతవరకు సానుకూలంగా ఉంచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ‘రెసిలియంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఇంధన రంగంలో పెరుగుతున్న అనిశ్చితి మధ్య భారత్ ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా, భిన్న ఇంధన వనరులను అభివృద్ధి చేయడం ద్వారా సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఒపెక్ పరిణామాలు ఎలా ఉన్నా, భారత్‌కు ఇదే దీర్ఘకాలిక వ్యూహమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో, యూఏఈ వైదొలగడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ క్రూడ్ మార్కెలో సరఫరా పెరగవచ్చని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ పేర్కొన్నారు. భారత్, యూఏఈ మధ్య ఉన్న సంబంధాల కారణంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి రూపాయిల్లో చెల్లింపులు మరింత వేగంగా జరగవచ్చన్నారు.

Next Story