- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IMF: భారత వృద్ధి అంచనాను పెంచిన ఐఎంఎఫ్
అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు నెమ్మదించడంతో ఐఎంఎఫ్ భారత వృద్ధిని పెంచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని నెలలుగా భారత వృద్ధి అంచనాలను దాదాపు అన్ని రేటింగ్ ఏజెన్సీలు తగ్గిస్తూ వచ్చాయి. అయితే, తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఏప్రిల్ అంచనా వేసిన 6.2 శాతం కంటే స్వలంగా ఎక్కువ. ఈ సవరణతో గ్లోబల్ పరిణామాల ప్రభావం తగ్గడాన్ని భావించవచ్చు. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు నెమ్మదించడంతో ఐఎంఎఫ్ భారత వృద్ధిని పెంచింది. తాజాగా జూలై వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ అప్‌డేట్ నివేదికలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాలను పేర్కొంది. 2025, 2026 రెండు సంవత్సరాల్లోనూ 6.4 శాతం మేర వృద్ధిని చూడనుంది. ఏప్రిల్‌లో ప్రకటించిన దానికంటే అమెరికా టారిఫ్ ప్రభావం తక్కువగా ఉండటం, బలహీనమైన యూఎస్ డాలర్ కారణంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇదే సమయంలో దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం వల్ల భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కొనసాగే దిశగా పయనిస్తోంది. ఏప్రిల్‌లో భారత్ ప్రస్తుత ధరల ప్రకారం 4.187 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. అదేవిధంగా 2027 నాటికి జర్మనీని అధిగమించడం ద్వారా భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక, 2025 నాటికి ప్రపంచ వృద్ధి 3 శాతంగా, 2026 నాటికి 3.1 శాతంగాగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనాలో వేస్తున్నట్టు పేర్కొంది.






