Gold Monetization Scheme: బంగారం లాకర్ బదులు ...గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో పెడితే సేఫ్టీతో పాటు వడ్డీ కూడా లభించే ఛాన్స్..!!

by Vennela |

Gold Monetization Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా.? అయితే ఈ సమాచారం మీ కోసమే.

Gold Monetization Scheme: బంగారం లాకర్ బదులు ...గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో పెడితే సేఫ్టీతో పాటు వడ్డీ కూడా లభించే ఛాన్స్..!!
X

దిశ, వెబ్ డెస్క్: Gold Monetization Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా.? అయితే ఈ సమాచారం మీ కోసమే. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధీనిలో ప్రస్తుతం భారీ మార్పులు వచ్చాయి. ఈ స్కీం గురించి ముందు తెలుసుకుందాం. ఉదాహరణకు మీ ఇంట్లో బంగారం ఉంది. అలా బంగారం ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ కాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు బ్యాంక్ వెళ్లి బ్యాంకు లాకర్ ని ఓపెన్ చేసి దాంట్లో దాస్తారు. కానీ బ్యాంకు లాకర్ ఫ్రీ కాదు దానికి మనం రెంట్ కట్టాలి. ఈ రెంట్ ఏడాదికి 3000 వరకూ ఉంటుంది. అలాగే బ్యాంకు మనకి బ్యాంక్ లాకర్ ని ఇవ్వాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విషయానికి వస్తే మనం ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మన బంగారాన్ని ఈ స్కీమ్ పేరు చెప్పి డిపాజిట్ చేస్తే బ్యాంకే మనకి వడ్డీ ఇస్తుంది. ఇది 2.5% నుంచి 5% వరకు ఉంటుంది. ఈ స్కీమ్ లో చాలా రోజులు మూడు టెన్యూర్ ఆప్షన్స్ ఉండేవి. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది మిడ్ టర్మ్, మూడోది లాంగ్ టర్మ్.

ఇందులో షార్ట్ టర్మ్ లో చూసుకున్నట్లయితే, టెన్యూర్ 1 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత మన బంగారాన్ని మనకైతే ఇస్తారు. ఈ 3 ఏళ్ల పాటు వడ్డీ అన్నది మన బ్యాంక్ అకౌంట్ లో ప్రతి ఏడాది మార్చ్ 31 న పడుతుంది. అదే మిడ్ టర్మ్ అంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ అంటే 12 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే గతంలో ఈ మూడు ఆప్షన్స్ ఉండేవి. కానీ ఏప్రిల్ నుండి మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆప్షన్ నిలిపివేశారు. కేవలం షార్ట్ టర్మ్ మాత్రమే ఉంది.

ఈ స్కీమ్ లో భాగంగా ఓన్లీ గోల్డ్ కాయిన్స్ ని బిస్కెట్స్ ని మాత్రమే డిపాజిట్ చేయాలి. బ్యాంకు గోల్డ్ జ్యువలరీని తీసుకోదు. ఎందుకంటే టెన్యూర్ తర్వాత మీ చేతికి సేమ్ జ్యువలరీ రాదు. ఎందుకంటే ఎంత బరువైన బంగారాన్ని మీరు డిపాజిట్ చేశారో అంతే బరువైన గోల్డ్ కాయిన్స్, లేదా బిస్కెట్స్ మీకు అందిస్తారు. ఎవరైతే బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Next Story