- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IDFC First Bank: సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు తీసుకొచ్చిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో డెడికేటెడ్ మొబైల్ బ్యాంకింగ్ ఫీచర్, ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేటు, కాంప్లిమెంటరీ హెల్త్‌కేర్, సైబర్ ఇన్సూరెన్స్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్, సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది. ఈ అకౌంట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై అదనంగా 0.5 శాతం వడ్డీ, ముందుగా విత్‌డ్రా చేసుకున్నప్పటికీ ఎలాంటి పెనాలిటీ ఉండదని బ్యాంకు వివరించింది. అలాగే, బ్యాంకు మొబైల్ యాప్‌లో సీనియర్ సిటిజన్ స్పెషల్స్ అనే కొత్త ఫీచర్ లభిస్తుంది. దీని కింద సదరు పెద్ద ఖాతాలకు సంబంధించి ఆన్‌లైన్ మోసాలకు గురైతే రూ. 2 లక్షల సైబర్ బీమా కవరేజీ, గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యుల కోసం డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్, అది కూడా ఏడాది పాటు మెడీబడ్డీలో ఎన్నిసార్లైనా తీసుకునే సౌకర్యం లభిస్తుంది. నెట్‌వర్క్ ఫార్మసీలో గరిష్టంగా 15 శాతం డిస్కౌంట్, 50కి పైగా పారామీటర్లను కవర్ చేసే ఫుల్ బాడీ చెక్-అప్, రూ. 500 వ్యాలెట్ బ్యాలెన్స్ అందించనుంది. పెద్దలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలందించేందుకు ఈ ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుననట్టు బ్యాంకు రిటైల్ విభాగం హెడ్ చిన్మయ్ ధోబ్లె చెప్పారు. సీనియర్లకు సాధారణంగా సేవింగ్స్ అకౌంట్లపై విధించే 30కి పైగా ఛార్జీలను తొలగించిందని ఆయన పేర్కొన్నారు.