IDBI బ్యాంక్ నుంచి ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం!

by Disha Web Desk 17 |
IDBI బ్యాంక్ నుంచి ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐడీబీఐ బ్యాంక్ ఈ నెల ప్రారంభంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంకు వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు ప్రత్యేక 444 రోజుల కాలవ్యవధితో కూడిన కొత్త 'అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్'ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ ఎఫ్‌డీ పథకాన్ని ఎంచుకున్న వారికి అత్యధికంగా 7.15 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది సాధారణ ఖాతాదారులతో పాటు ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ వినియోగదారులకు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్‌లు గరిష్ఠంగా 7.65 శాతం వడ్డీ రాబడిని పొందవచ్చని బ్యాంకు తెలిపింది.

ఈ ప్రత్యేక ఎఫ్‌డీని ఎంచుకునే వారు ముందుగా ఉపసంహరించుకుంటే బ్యాంకు వడ్డీలో కోత ఉంటుంది. అలాగే, మిగిలిన కాలవ్యవధుల్లో 7-30 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం ప్రారంభ వడ్డీ లభిస్తుంది. 31-45 రోజుల డిపాజిట్లపై 3.35 శాతం, 46-90 రోజులకు 4.25 శాతం, 91 రోజుల నుంచి 6 నెలలకు 4.75 శాతం, 6 నెలల నుంచి ఏడాది కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు 5.50 శాతం, 1-2 ఏళ్ల(444 రోజుల ఎఫ్‌డీ మినహాయించి) డిపాజిట్లకు 6.75 శాతం, 2-3 ఏళ్లకు 6.50 శాతం, 3-10 ఏళ్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అన్ని కాలవ్యవధులపై అదనంగా 0.50 శాతం అధిక వడ్డీ వర్తిస్తుంది.



Next Story

Most Viewed