Warren Buffett: బాధ్యతల నుంచి తప్పుకోనున్న వారెన్ బఫెట్.. షేర్‌హోల్డర్లకు చివరి లేఖ

by S Gopi |

ఇకపై కంపెనీ సమావేశాల్లో వార్షిక నివేదికలు రాయనని, కీలక పదవుల నుంచి నెమ్మదిగా తప్పుకుంటానని ప్రకటించారు.

Warren Buffett: బాధ్యతల నుంచి తప్పుకోనున్న వారెన్ బఫెట్.. షేర్‌హోల్డర్లకు చివరి లేఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఈ ఏడాది చివరి నాటికి బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన తర్వాత గ్రెగ్ అబెల్ ఆయన వారసుడిగా ఉంటారు. కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో తాజాగా ఆయన తన కంపెనీ వాటాదారులకు వీడ్కోలు లేఖ రాశారు. ఇకపై కంపెనీ సమావేశాల్లో వార్షిక నివేదికలు రాయనని, కీలక పదవుల నుంచి నెమ్మదిగా తప్పుకుంటానని ప్రకటించారు. వార్షిక సమావేశాల్లో మాట్లాడే సమయాన్ని కూడా తగ్గించుకోనున్నట్టు స్పష్టం చేశారు. బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీకి ఆరు దశాబ్దాల పాటు సీఈఓగా ఉన్న ఆయన, ఇప్పటికే సంస్థ కీలక బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. కొంతమంది ఇన్వెస్టర్లకు మాత్రం థ్యాంక్ గివింగ్ మేసేజ్‌లు పంపిస్తానని షేర్‌హోల్డర్లకు రాసిన చివరి లేఖలో స్పష్టం చేశారు. తాను 95 ఏళ్లు జీవించడమే అదృష్టంగా భావిస్తున్నామని, తనకు ఎనిమిదేళ్ల వయసులో అపెండిసైటిస్ వచ్చినప్పుడు దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చాను. బెర్క్‌షైర్ హాత్‌వే స్థాపించడంలో కీలక వ్యక్తి చార్లీ ముంగర్ 99 ఏళ్ల వయసు(2023)లో కన్నుమూశారు. ఆయన తనకు గురువు, పెద్దన్నయ్య లాంటివాడు. కొన్ని సందర్భాల్లో మా ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చినా కలిసే కొనసాగామని ప్రస్తావించారు. తదుపరు బెర్క్‌షైర్ బాధ్యతలను గ్రెగ్ తీసుకుంటాడు. తన కుమారులతో పాటు సంస్థ బోర్డు గ్రెగ్‌కు సంపూర్ణంగా అండగా ఉంటుందని వారెన్ బఫెట్ పేర్కొన్నారు.

Next Story