Hyundai Motors: ధరలు పెంచిన హ్యూండాయ్ మోటార్స్

by S Gopi |

2026, జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం వెల్లడించింది.

Hyundai Motors: ధరలు పెంచిన హ్యూండాయ్ మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో కార్ల తయారీ కంపెనీలు వరుసగా ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు ప్రీమియం బ్రాండ్లు పెంపు నిర్ణయాన్ని ప్రకటించగా, తాజాగా హ్యూండాయ్ మోటార్ ఇండియా సైతం ధరల పెంపును ప్రకటించింది. విలువైన లోహాలు, ఇతర ముడిసరుకు ధరలు ఖరీదైన కారణంగా 2026, జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు బుధవారం వెల్లడించింది. అన్ని వాహనాలపైనా 0.6 శాతం మేర పెంపు ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించి కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎప్పటికప్పుడు ఖర్చులను నియంత్రించేందుకు, సర్దుబాటు చేసేందుకు, సాధ్యమైనంత మేర వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రయత్నించామని కంపెనీ వివరణ ఇచ్చింది. కానీ, క్రమంగా పెరుగుతున్న ఖర్చులలో కొంత భాగం బదిలీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం హ్యూండాయ్ మోటార్ కంపెనీ హ్యాచ్‌బ్యాక్ ఐ10 మోడల్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) ఎస్‌యూవీ మోడల్ ఐయోనిక్ 5 వరకు అనేక కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 5.47 లక్షల నుంచి రూ. 47 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య ఉన్నాయి.

Next Story