- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyundai Motor India: దేశంలో హ్యుండాయ్ భారీ పెట్టుబడులు.. ఐదేళ్లలో రూ. 45 వేల కోట్లు
పూర్తిగా 7 కొత్త మోడళ్లను, మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తెస్తామన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయంగా భారీ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత మార్కెట్లో రూ. 45,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దీని ద్వారా భవిష్యత్తులో కంపెనీ వృద్ధిని మరింత వేగవంతమవుతుందని భావిస్తోంది. ఎంపీవీ, ఎస్‌యూవీ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు కంపెనీ సీఈఓ జోస్ మునోజ్ అన్నారు. అంతేకాకుండా కొత్తగా 26 కార్లను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా పూర్తిగా 7 కొత్త మోడళ్లను, మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తెస్తామన్నారు. బుధవారం ముంబైలో జరిగిన కంపెనీ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. 2027 నాటికి స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల చేస్తామని, అదే ఏడాది కంపెనీకి చెందిన లగ్జరీ బ్రాండ్ జెనెసిస్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. గతేడాదితో భారత మార్కెట్లో కంపెనీ 29 సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో పాటు కీలక ఐపీఓ ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలోనే తదుపరి దశలో ముందుకెళ్లడానికి ఈ పెట్టుబడి ప్రణాళిక సిద్ధం చేశాం. రానున్న రోజుల్లో కంపెనీకి భారత మార్కెట్ ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మార్చాలని భావిస్తున్నాం. కనీసం 30 శాతం ఎగుమతులు చేయాలనుకుంటున్నామని మునోజ్ వివరించారు.






