- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyundai Motor: ధరలు పెంచిన హ్యూండాయ్ మోటార్ ఇండియా
by S Gopi |
అన్ని వాహనాల ధరలను 1 శాతం వరకు పెంచనున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటనలో తెలిపింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్ల తయారీలో కీలకమైన ముడిసరుకు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాల ధరలను 1 శాతం వరకు పెంచనున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటనలో తెలిపింది. సవరించిన ధరలు మే నెల నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ధరల హెచ్చుతగ్గుల భారాన్ని వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. పెరుగుతున్న ఖర్చులను కారణంగా కొంతవరకు ధరల భారాన్ని బదిలీ చేశామని కంపెనీ వివరణ ఇచ్చింది.
Next Story






